Tuesday, April 21, 2026
HomePoliticsరాజ్యసభకు సింఘ్వి, నరేందర్ రెడ్డి

రాజ్యసభకు సింఘ్వి, నరేందర్ రెడ్డి

సీఎం సమక్షంలో నామినేషన్ దాఖలు

కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి వీరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. సింఘ్వీ.. మూడు సెట్‌ల నామినేషన్లు దాఖలు చేయగా.. వేం నరేందర్ రెడ్డి నాలుగు సెట్‌లు, ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి.. ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఈ నామినేషన్లను ఎన్నికల అధికారి పరిశీలించనున్నారు. ఎమ్మెల్యేల సంతకాలు లేని ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించనున్నారు. దాంతో అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థులు నిలవనున్నారు. వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బరిలో నిలపలేదు. దీంతో వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గతంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లిన అభిషేక్ మను సింఘ్వీ పదవి కాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఇక తెలంగాణ నుంచి మరో రాజ్యసభ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు, సూపర్ సీనియర్లు దాదాపు 16 మంది పోటీ పడ్డారు. ఆ జాబితాలోని ఎవరికి ఈ రాజ్యసభ స్థానం దక్కుతుందంటూ తీవ్ర ఉత్కంఠ సైతం నెలకొంది. అందుకోసం బుధవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు అయ్యారు. చివరకు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments