చోడవరం: చోడవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా సీనియర్ నాయకుడు సరగడం సిమ్ము నాయుడును నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం తెలిపారు. మొదటినుంచి పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా నాయకునిగా పనిచేస్తూ ఏ పదవులను ఆశించకుండా నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు అమరనాథ్ కోరిక మేరకు పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. విద్యార్థి దశ నుంచి కూడా నాయకత్వ పటిమ కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ పదవుల మీద వ్యామోహం లేకుండా పార్టీ అభివృద్ధికి విజయానికి కృషి చేస్తున్నారు. అలాంటి వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించడం ఎంతో అభినందనీయమని పార్టీ నాయకులు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షునికి ఆయన ధన్యవాదాలు. అలాగే చోడవరం పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షునిగా దేవరపల్లి సత్యా నీ నియమించారు.
