Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshగంటాను మర్యాదపూర్వకంగా కలిసిన సింహాచలం ఈఓ

గంటాను మర్యాదపూర్వకంగా కలిసిన సింహాచలం ఈఓ

సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన జె. వెంకట్రావు సోమవారం ఎంవీపీ కాలనీలోని నివాసంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. సింహాచలం దేవస్థానం అభివృద్ధికి నిర్ధిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు. ఏప్రిల్ 20 న జరగబోయే స్వామి వారి చందనోత్సవంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేదపండితులు మంత్రోర్చనలతో ఎమ్మెల్యే ను ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు. ఆలయ ఏఈఓ తిరుమలేశ్వరరావు, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments