Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshఆశల పల్లకిలో సిక్కోలు వాసులు

ఆశల పల్లకిలో సిక్కోలు వాసులు

మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ తో ఉపాధి లభించేనా ? అరచేతిలో వైకుంఠం లా
నిరుద్యోగుల చూపులు ,ఉత్తరాంధ్రలో ప్రగతి పదానికి బాటలు వేసి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చేతినిండా పని జేబునిండా మనీ లభిస్తాయని కొండంత ఆశతో సిక్కులు వాసులు మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పై కొండంత ఆశతో ఎదురుచూస్తున్న వైనం ఈ ప్రాంతంలోని ప్రతి నిరుద్యోగులు, స్థానికులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట సముద్ర తీరంలో వైయస్సార్సీపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2023 lo మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కు శంకుస్థాపన చేశారు. రూ 4,362 కోట్ల వ్యయంతో 23,5 మిలియన్ల సామర్థ్యంతో నాలుగు బెర్తులు నిర్మాణాన్ని చేపట్టి 30 నెలల్లో దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆనాటి ప్రభుత్వం తలపెట్టింది. మూడు రాష్ట్రాలైన ఒడిస్సా, చత్తీస్గడ్, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి బొగ్గు కంటిన్యూస్ బల్క్ కార్గో ముడి సరుకుల నిర్వహణ ఎగుమతి దిగుమతులు వాణిజ్య వ్యవహారాలు పూర్తిస్థాయిగా అందించేందుకు మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ సిద్దమవుతుంది, శ్రీకాకుళం జిల్లా తో పాటు ఉత్తరాంధ్ర రూపు రేఖలు మార్చేందుకు అభివృద్ధికి స్థానికుల కు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి, బతుకుతెరువు కల్పించి కుటుంబాలు వలస బాట పట్టకుండా స్థానిక వనరులపై ఆధారపడి జీవించోచ్చని పెద్ద ఆశ జిల్లా వాసుల గుండెల్లో నిండి వుంది. నేడు కూ టమి ప్రభుత్వం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణ పనులను ఏపీ మారిటైమ్ సంస్థ ద్వారా యుద్ధ ప్రాతపదికన నడిపిస్తూ విశాలమైన రహదారులు, అనుబంధ పరిశ్రమలు కు అవసరమైన అనుమతులు ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. స్థానిక గ్రామాల అభివృద్ధి కోసం 594 నిర్వాసిత కుటుంబాలకు 109 కోట్లు కేటాయించారు.2025 లో కూటమి ప్రభుత్వం ట్రయల్ రన్ పూర్తి చేశారు,2026 చివరీ నా టికి మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ప్రారంభానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.సిక్కోలు ప్రజలకు ప్రాజెక్టు పూర్తవుతుందన్న ఆశలు తప్ప స్థానికంగా నిరుద్యోగులకు ఎలాంటి భరోసా కనిపించడం లేదని ఆవేదనతో ఉన్నారు, ఈ ప్రాంతంలో చిరకాల స్వప్నం నెరవేరి అందరికీ ఉపాధి ప్రత్యామ్నాయ ఉపాధులు కొనసాగుతాయని ఈ గ్రామాల్లో వలసలు తగ్గుతాయని అందరికీ ఆర్థికపరమైన అవకాశాలు లభిస్తాయని ఈ ప్రాంత వాసులు ప్రభుత్వాలపై ఆశలతో ఎదురుచూపులు చూస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments