Friday, April 24, 2026
HomePoliticsAndhra Pradeshశివోహం.. హరిహర సుతునీ నామస్మరణతో మార్మోగిన శివాలయాలు.

శివోహం.. హరిహర సుతునీ నామస్మరణతో మార్మోగిన శివాలయాలు.

శివోహం…….

– హరిహర సుతునీ నామస్మరణతో మార్మోగిన శివాలయాలు.

– క్రీడల వైపు మొగ్గు చూపుతున్న యువత.

మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అనంతగిరి మండలంలోని బొర్రా గుహాలు, లంగుపర్తి, కాశిపట్నం, శివాలయ క్షేత్రాలు హరిహతుని శివనామస్మరణతో మారుమోగాయి వేలాది భక్తుల తరలివచ్చి జాగరణ చేస్తూ లింగోద్భవ కాలంలో
ప్రత్యేక అభిషేకాలు నోములు వ్రతాలు నిర్వహించి మొక్కులు, తలనీలాలు సమర్పించుకున్నారు
హరిహర స్తుతుని భక్తులు పుణ్యస్నానం ఆచరించి సోమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాటులు చేశారు శనివారం రోజు నుండి భక్తులకు
పలు ప్రత్యేక అలంకరణతో అభిషేకాలు నిర్వహించారు. గిరిజన ప్రాంతం సాంప్రదాయ దింసా నృత్యంతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరింపజేశారు. అనంతగిరి మండలం ఎస్సై శంకర్రావు పలువురు కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ల్ల తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు
భక్తులు నలు దిక్కుల నుండి
పోట్టెత్తటం తో
భారీగా ట్రాఫిక్ జామ్ అయింది పోలీసు వారు
బారికేడ్లు ఏర్పాటు చేసి
ట్రాఫిక్ నియంత్రణ చేశారు.

*ఉత్సవ కమిటీలదే బాధ్యత.*

.లంగుపర్తి గ్రామంలో ఉత్సవ కమిటీ సహకారంతో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ను అనంతగిరి మండల సభ్యుని ఇన్స్పెక్టర్ శంకర్రావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీర దారుణ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చిన్నతనం నుంచి క్రీడలు పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. అలాగే గ్రామాలలో మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాలను ఉత్సవ కమిటీ చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.ఏ గ్రామాలలో మూడు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు ముందస్తుగా తమకు సమాచారం అందించాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments