Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshసామజిక అభివృద్దే లక్ష్యంగా షిల్డ్ సొసైటీ సేవా సంస్థ ప్రారంభం

సామజిక అభివృద్దే లక్ష్యంగా షిల్డ్ సొసైటీ సేవా సంస్థ ప్రారంభం

సామాజిక మానవ హక్కుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, న్యాయ సహాయం మరియు సమాజ అభివృద్ధి లక్ష్యాలతో షిల్డ్ సొసైటీ అనే సేవా సంస్థను ఆరిలోవ కాలనీలో ఘనంగా ప్రారంభించారు.
సామాజిక మానవ హక్కుల సమావేశ పర్యావరణ న్యాయ సహాయ అభివృద్ధి సేవా సంస్థ. ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు న్యాయం అందించడం, ప్రజల్లో హక్కులపై అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణపై చర్యలు చేపట్టడం ప్రధాన లక్ష్యం అని వ్యవస్థాపకులు తెలిపారు.
ఈ సందర్భంగా వ్యవస్థాపకులు
జెర్రిపోతుల అప్పారావు, చిన్నమ్మలు మరియు సీఈఓ పిల్లా సత్యస్వాతి, బీజేపీ నాయకులు, పిడుగురాళ్ళు, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆత్మకూరి కాశీ విశ్వనాథం, ప్రాజెక్ట్ డైరెక్టర్ డా ఆదిత్య రంగనాథ్ వెంపల, మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, న్యాయం, బాధ్యతాయుత జీవన విధానం ఏర్పడేందుకు షిల్డ్ సొసైటీ కృషి చేస్తుందని తెలిపారు., భవిష్యత్తులో న్యాయ అవగాహన శిబిరాలు, పర్యావరణ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు హాజరై సంస్థకు తమ మద్దతు తెలిపారు.
సమాజ సేవలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంస్థలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments