Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshఏడు రోజుల ఉత్కంఠకు తెర… పులి బందీ

ఏడు రోజుల ఉత్కంఠకు తెర… పులి బందీ

తూర్పుగోదావరి జిల్లాలో గత వారం రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన పెద్ద పులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కింది. రాయవరం మండలం కూర్మాపురం గ్రామ పరిధిలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో శుక్రవారం ఈ పులి బందీ అయింది. పులి పట్టుబడటంతో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది.
గత ఏడు రోజులుగా రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, రాయవరం మండలాల్లో పులి సంచరిస్తూ ప్రజలను భయపెట్టింది. ఈ సమయంలో ఆరు పశువులను చంపడంతో పాటు, గ్రామాల పరిసరాల్లో సంచరిస్తూ రాత్రివేళ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసింది. వ్యవసాయ పనులు, పశుపోషణపై తీవ్ర ప్రభావం పడింది.
పులి కదలికలను గమనించిన అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కెమెరా ట్రాప్‌ల సహాయంతో దాని మార్గాలను గుర్తించారు. అనంతరం వ్యూహాత్మకంగా బోనును ఏర్పాటు చేయగా, చివరకు పులి చిక్కిందని అధికారులు తెలిపారు. ఇది అటవీ శాఖ ప్రణాళిక విజయవంతమైందని పేర్కొన్నారు.
పట్టుబడిన పులిని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సురక్షిత అటవీ ప్రాంతానికి తరలిస్తామని అధికారులు వెల్లడించారు. పులి బందీ కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకొని, ప్రశాంత వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments