Home News కేజీహెచ్‌లో ‘స్వయంభుపాలన’…!

కేజీహెచ్‌లో ‘స్వయంభుపాలన’…!

0

– అనధికారికంగా ఇద్దరు హెడ్ నర్సులు
– వారిని ఎందుకు రిలీవ్ చేయడం లేదో
– ప్రభుత్వ నర్సుల సంఘం తీరుపై అనుమానాలు

కేజీహెచ్‌లో పరిపాలన అంటే ఇదేనా అన్నట్టుగా సాగుతోంది. పాలనలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. అభివృద్ది పరిపాలన చేసే అధికారులకే గానీ…అది మచ్చుకైనా ఆస్పత్రిలో లేదనే వాదన వినిపిస్తోంది. అనధికారికంగా ఉద్యోగం చేయడమంటే ప్రభుత్వ ఉద్యోగులకు భయమేయాలి. ఎందుకంటే అంతా రికార్డుగా ఉంటుంది. తప్పించుకోవడం అంత సులువు కాకపోవడంతో నిబంధనల మేరకు భవిష్యత్‌లో సమస్యలొస్తాయని ఎక్కడి వారు అక్కడికి డ్యూటీ నిమిత్తం వెళ్లిపోతుంటారు. కానీ ఇక్కడ స్వయంభువుల పాలనలో మాత్రం దర్జాగా ఎలాంటి చీకూ చింతా లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా చేసుకుపోతున్నారు. అలాంటి వారి గుట్టు బయటకు పొక్కకుండా వెనకేసుకు రావడం వెనుక ప్రభుత్వ నర్సుల సంఘం ప్రతినిధులు కూడా తమ సహాయం అందిస్తున్నారు. దీనికి వెనుక మతలబు ఏంటో ఈ పాటికే అర్ధమై ఉండొచ్చన్నది జగమెరిగిన సత్యం.
వివరాల్లోకి వెళితే ఏయే అవసరాల నిమత్తమో గానీ ఇద్దరు హెడ్ నర్సులు కేజీహెచ్‌కు డెప్యూటేషన్‌పై గతేడాది వచ్చారు. ఒకరు పాడేరు నుంచీ…ఇంకొకరు శ్రీకాకుళం నుంచి కేజీహెచ్‌లో వాలిపోయారు. అంతకు ముందు వారేమైనా ఆయా ప్రాంతాల్లో కష్టపడి విధులు నిర్వహించారా…అంటే అదేమీ లేదు. దీర్ఘకాలంగా విశాఖలోనే ఉన్నారన్న రికార్డుల మేరకు గ·తేడాది జరిగిన బదిలీల్లో వారిద్దరినీ బదిలీ చేశారు. అంతే గరిష్టంగా ఓ మూడు మాసాల పాటు కూడా ఆయా జిల్లాల్లో పని చేయని సదరు హెడ్ నర్సులు వాళ్ల వ్యక్తిగత ఆరోగ్య సంబంధ కోర్కెల మేరకు…కూటమి నేతల సిఫార్సులతో వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు ఈ డెప్యూటేషన్‌కు అనుమతిచ్చారు. అదీ కూడా చాలా స్పల్ప గడువును సూచిస్తూ మూడు మాసాలకే డెప్యుటేషన్‌ను పరిమితం చేశారు. ఆ గడువు అయిన వెంటనే మళ్లీ సిఫార్సులు ఫోన్లు హోరెత్తిపోవడంతో తట్టుకోలేని హెల్త్ డైరెక్టర్ ఇక మళ్లీ ఇలాంటి వేషాలేయొద్దంటూనే అయిష్టంగానే మరో రెండు మాసాలు పొడిగించారు. ఆ రెండు మాసాలు కూడా ఒకరికి మార్చి మాసంలో అయితే ఇంకొకరికి గత వారంలో గడువు అయిపోయింది. గడువు అయిన మరుక్షణమే వాళ్లు ఆయా ఒరిజనల్ స్థానాలకు వెళ్లిపోవాలి. వారికి వెళ్లే ఇష్టం లేదనుకో…సంబంధిత క్లర్కులు ఉన్నతాధికారులకు గుర్తు చేసి రిలీవ్ ఆర్డర్లు వారి చేతిలో పెట్టాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని వారికి విధులు వేయకుండా నర్సింగ్ సూపరింటెండెంట్లు అడ్డుకోవాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా యధావిదిగా పనులు జరిగిపోతున్నాయంటే…ప్రభుత్వ నర్సుల సంఘం ప్రతినిధులే వారి వెనక ఉండి నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేకుంటే ఇంత ధైర్యంగా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఎలా డ్యూటీలు చేస్తారన్నది ఆ ఏడు కొండల వెంకట రమణకే తెలియాలని అంతా అనుకుంటున్నారు. ఆయన కరుణా…కటాక్షాలు లేకుండా కేజీహెచ్‌లో ఉద్యోగం చేయడం ఈ రోజుల్లో అంత ఈజీయా…అని ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు.

వీళ్లకు మాత్రం బదిలీ…!
అడ్డుకున్న జెడ్పీ చైర్మన్ సుభద్ర…!
కేజీహెచ్ ఎస్సీ ఎస్టీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉద్యోగులను పాడేరు జిల్లాకు ఆకస్మిక బదిలీ చేయాలని సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ పట్నం జిల్లా కార్యవర్గం విశాఖ పట్నం ఛైర్మన్ జి. శుభద్రని కలసి క్యాజువాల్టీ ఎస్టీ విభాగం ప్రాముఖ్యతని, ఆదివాసీ ప్రాంతాల నుండి వైద్య సేవల కోసం వచ్చే అమాయక ప్రజల అవసరాలను వివరించి ఈ విభాగంలో సిబ్బందిని యధాతథంగా కొనసాగించి, వైద్య సేవలను అందించాలని కోరారు. ఆ వెంటనే ఛైర్మన్ సుభద్ర జిల్లా కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారులకు ఫోన్ చేసి వారిని ఒప్పించి ఉద్యోగుల ఆకస్మిక బదిలీ ఉత్తర్వులను గురువారం రద్దు చేయించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version