Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshయుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సైన్స్ టాలెంట్ టెస్ట్

యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సైన్స్ టాలెంట్ టెస్ట్

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కొత్తూరు మండల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ను, మండల విద్యాశాఖాధికారులు చందక గోవిందరావు, నిమ్మల శ్రీనివాసరావుల పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు.
నివగాం ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు జి.రాఘవదాసు సమన్వయంతో క్రమశిక్షణాయుతంగా ఈ పరీక్ష నిర్వహణ జరిగిందని యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు కె.విజయకుమార్, ప్రధాన కార్యదర్శి వాన మధుసూదనరావు, సీనియర్ నేతలు ఆర్.ఆర్.ఎం.కొండలరావు, దండు ప్రకాశరావు, పూర్వ జిల్లా కార్యదర్శి బోడ శ్రీను, జి.మాధవరావు తదితరులు తెలిపారు. మండల పరిధిలో గల వివిధ పాఠశాలల నుండి 192 మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తొలి ఐదు స్థానాల్లో గురివిందల పాఠశాల విద్యార్ధి
ఎల్.జితేంద్రప్రసాద్, పారాపురం పాఠశాల విద్యార్ధిణి దూసి జాహ్నవి, ఆర్.ఆర్.గూనభద్ర పాఠశాల విద్యార్థిణి
పెద్దకోట తన్విశ్రీ, గులివిందులపేట పాఠశాల విద్యార్ధిణి మురపాక శ్రావ్య, ఆర్.ఆర్.గూనభద్ర పాఠశాల విద్యార్ధి పెద్దకోట కార్తికేయలు విజేతలుగా నిలిచి బహుమతులు అతిథుల చేతులమీదుగా స్వీకరించారు.
అదనంగా 10వ స్థానం వరకు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఇదే వేదికపై ప్రతీ స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను అందజేశారు. కొత్తూరు మండల శాఖ యుటిఎఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ యుటిఎఫ్ కొత్తూరు మండల శాఖ తరఫున అధ్యక్ష కార్యదర్శులు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments