దీర్ఘకాలిక సమస్యల పైనే మా దృష్టి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చన్న వెల్లడి రాష్ట్రంలోని సుదీర్ఘ కాలము నుంచి ప్రజలకు వెంటాడుతున్న సమస్యలపై దృష్టి సారించి ప్రజలు వద్దకే పరిపాలన జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు స్పష్టం చేశారు.శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజా విజ్ఞప్తులపై స్పందించి సుదీర్ఘకాలం నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు దృష్టి సారించి తక్షణమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. సంబంధిత సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి మెజారిటీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యలు కనుక్కొని కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను ప్రజల వద్దకే పరిపాలన జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు.
