Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshపారిశుధ్య మహిళలకు సన్మానం

పారిశుధ్య మహిళలకు సన్మానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని “మన మహిళ – మన ఆత్మగౌరవం” కార్యక్రమాన్ని బీజేపీ ఎస్సీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశుధ్య మహిళా కార్మికులను ఘనంగా సత్కరించారు.
కేంద్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య ఆదేశాల ప్రకారం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మరియు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తగరం సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా పారిశుధ్య మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించిన చిత్రపటాలను అందజేసి సన్మానించారు. మహిళా కార్మికులు సమాజానికి అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, సీనియర్ నాయకులు గుర్రాల వెంకట్రావు, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మి పన్నాల సంతోషి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మట్టడి రమణ, జోనల్ ఇన్‌చార్జి సుమన్ బాబు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సాయిరామ్, జిల్లా ఎస్సీ మోర్చా జీఎస్ యజ్జల శ్రీను, ఉపాధ్యక్షుడు మలిపూడి రవి, కార్యదర్శి సుజాత, కొల్లాపు శ్రీను, చింతపల్లి సతీష్, పోలవరపు రాము, యజ్జల ప్రతాప్, యేసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments