Home Politics Andhra Pradesh కంబాల చెరువులో పారిశుద్ధ్య చర్యలు

కంబాల చెరువులో పారిశుద్ధ్య చర్యలు

0

జయజయహే వార్త కు స్పందన
రాజమహేంద్రవరం నగరంలోని కంబాల చెరువు పార్క్ లో పారిశుద్ధ్యానికి అధికారులు పెద్దపీట వేశారు. చెరువులో చేపలు మృతి చెందడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ, ఉదయం–సాయంత్రం వాకింగ్‌కు వచ్చే వారికి తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సమస్యపై గత నెల 12న ‘జయజయహే’ దినపత్రికలో “కంబాల చెరువులో దుర్గంధం” శీర్షికన కథనం ప్రచురితమైంది. వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. చెరువులో మృతి చెందిన చేపలను పూర్తిగా తొలగించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.
అధికారుల చర్యలతో ప్రస్తుతం పార్క్ పరిసరాల్లో దుర్గంధం తగ్గుముఖం పట్టిందని, వాకింగ్‌కు వచ్చే ప్రజలు ఉపశమనం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా క్రమం తప్పకుండా పారిశుద్ధ్య చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version