Home Spl Stories పేదల ఆరోగ్యానికి ప్రభుత్వ బాధ్యత

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వ బాధ్యత

0

సీఎం నిధి ద్వారా మూడు కోట్లు సహాయం

రాష్ట్ర మంత్రి కింజరాపు మంత్రి వెల్లడి

రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి టెక్కలి నియోజకవర్గం పరిధిలో 995 మంది అనారోగ్యంతో ఉన్నవారికి మూడు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు.

రాష్ట్రంలో పేదోళ్ళ ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద బాధ్యత వహిస్తుందని ప్రతి ఒక్కరికి ఆరోగ్య సహాయం అందజేస్తామని అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల ఉచిత వైద్య బీమా సౌకర్యం కల్పించునున్నట్లు మంత్రి కింజరాపు తెలిపారు, ఈరోజు కోటబొమ్మాలి లో ఎన్టీఆర్ భవన్ లో 22 మంది లబ్ధిదారులకు 19 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులు అందజేశామన్నారు.

ఆపదలో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుందని ఓ సోదరుడిగా భరోసా ఇస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు అధికారులు అన అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version