Home Politics Andhra Pradesh విద్యార్థుల ప్రతిభతో మంచి ఉద్యోగ అవకాశాలు

విద్యార్థుల ప్రతిభతో మంచి ఉద్యోగ అవకాశాలు

0

గాంధీనగరం బిసి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బ్రైడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోసం ఎటువంటి విద్యను అభ్యసించాలో అనే అంశంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసారు ఈ సదస్సులో సమస్త అధ్యక్షులు కాళ్ళ శివశంకర్ మరియు కార్యదర్శి తాతపూడి జయశ్రీ మాట్లాడుతూ విద్యార్థి దశలో బాగా చదవాలని వాళ్ళకి అవసరమైన రంగంలో రాణించడానికి మధ్య విద్యను అభ్యసించడంతోపాటు నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు,వసతి గృహాల్లో చదివే విద్యార్థులు చాలామంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాబట్టి వారికి ఏం చదివితే ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయో తెలియదు కాబట్టి ఇప్పటినుండే సరియైన ప్రణాళిక వేసుకొని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల పెద్దల సలహాలు సూచనలు తీసుకొని వారి భవిష్యత్తును ప్రణాళిక బద్దంగా తయారు చేసుకోవాలని తెలిపారు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి పూర్తయిన తర్వాత ఏ కోర్సులు చదివితే ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయో కోర్సులు ఉద్యోగ ఉపాధి అవకాశాలను గురించి వారికి క్షుణ్ణంగా వివరించి వారి యొక్క సందేహాలను నివృత్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు బి బి బి ప్రసాద్ సిహెచ్ ప్రదీప్ కుమార్ పివి కిరణ్మయి కేఎస్ జ్యోతి కుమారి మరియు హాస్టల్ నిర్వాహకులు సత్యనారాయణ శ్రీనివాస్ సత్యానందం స్థానిక ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version