చేయించిన సిఎస్ విజయానంద్ రాష్ట్ర సమాచార కమిషన్ కు నూతనంగా నియమితులైన కమిషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు.ఈమేరకు మంగళవారం ఎపి సచివాలయంలో నూతన కమిషనర్లతో ప్రమాణం చేయించారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ కమిషనర్ సహా ఇతర కమిషనర్లను నియమించడం జరిగింది.రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నూతన కమిషనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ గా వజ్జా శ్రీనివాసరావుతో ముందుగా సిఎస్ విజయానంద్ ప్రమాణం చేయించారు. అనంతరం విశాఖ కు చెందిన న్యాయవాది పరవాడ సింహాచలం నాయుడు,వంటేరు రవిబాబు,ఆదెన్న గాజుల,చరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి వట్టికూటిచే సమాచార కమిషనర్లుగా ప్రమాణం చేయించారు.ఈసందర్భంగా నూతన కమిషనర్లకు సిఎస్ పుష్పగుచ్చాలు అందించి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ,ఆర్టీఐ అధికారులు,నూతన ఆర్టీఐ కమీషనర్ల కుటుంబ సభ్యులు, సచివాలయం సిబ్బంది, విశాఖపట్నం మరియు వివిధ బార్ అసోసియేషన్ ల నుండి అధిక సంఖ్యలో న్యాయవాదులు,తదితరులు పాల్గొన్నారు.
