Home News శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత..

శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత..

0

పర్యాటక అభివృద్ధికి అందరూ సహకరించాలి..రంపచోడవరం డిఎస్పీ సాయి ప్రశాంత్
నేరాల నియంత్రణ , పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని రంపచోడవరం డిఎస్పీ సాయి ప్రశాంత్ రిసార్ట్స్ , బొలెరో వాహనాల యజమానులకు సూచించారు.
స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మారేడుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీజిఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో రిసార్ట్స్ , బొలెరో వాహనాల యజమానులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహనా సదస్సులో డిఎస్పీ సాయి ప్రశాంత్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత అని చెప్పారు .రిసార్ట్, వాహన యజమానులకు డీఎస్పీ సాయి ప్రశాంత్ దిశానిర్దేశం చేశారు.నేర నియంత్రణలో పోలీసులకు సహకరించాలని పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేస్తూ, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు.రిసార్టుల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మారేడుమిల్లి ఎస్ఐ కన్నుల శ్రీనివాస్ , గుర్తేడు ఎస్ఐ రాజ్ కోటి అధిక సంఖ్యలో రిసార్ట్ నిర్వాహకులు, వాహన యజమానులు , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version