Sunday, May 31, 2026
HomePoliticsAndhra Pradeshమంచి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని వినతి

మంచి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని వినతి

అనకాపల్లి జీవీఎంసీ జోనల్ సూపర్డెంట్ ఎస్ అప్పలనాయుడు ను ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ కలిసి 84 వ వార్డు కొప్పాక దగ్గర విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, ఫార్మాసిటీ, ఎన్టిపిసి, గంగవరం పోర్ట్, గాజువాక నియోజకవర్గం ప్రజలు ఏలేరు కెనాల్ నుండి గోదావరి జిల్లాలు సరఫరా జరుగుచున్నవి. కొప్పాక మరియు పరిసర గ్రామాల నుండి మురికి నీరు వర్షపు నీరు అక్కడ ఉన్న ఏలేరు కెనాల్ మీద పెద్ద పైపు ద్వారా కొప్పాక పాత చెరువులోనికి ఆ యొక్క నీరు వెళ్లి అచ్చట నుండి పొలంలోకి రైతులు వాడుకునేవారు. ఆ పెద్ద పైపు లేకపోవడంతో కొప్పాక పరిసర ప్రాంతాల నుండి మల మూల విసర్జ మరియు మురికి నీరు నేరుగా కెనాల్ లోకి వెళ్ళుచున్నది గతంలో పలు మార్లు చెప్పినప్పటికీ జీవీఎంసీ వారు పట్టించుకోలేదు ఇటీవల మంచినీరు కలుషితమై రకరకాల జబ్బులు వస్తున్నవి కావున జీవీఎంసీ వారు గోదావరి జలాలు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నామని వినతి పత్రం అందజేయడం జరిగినది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments