Home Politics Andhra Pradesh జామియ గుల్షనే ఫాతిమ బాలల మదరసా లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

జామియ గుల్షనే ఫాతిమ బాలల మదరసా లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

0

జాతీయ జెండాను ఆవిష్కరించిన విశ్రాంత డిప్యుటీ కలక్టర్ హసీం షరీఫ్  గాజువాక అహమ్మద్ నగర్ లో జామియా గుల్షనె ఫాతిమా ముస్లిం బాలికల మదరసా లో 77 వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా విశ్రాంత డిప్యూటీ కలక్టర్ హసీమ్ షరీఫ్ ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా బాలికల నుంచి గౌరవందన స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన ఉర్దూ లో మాట్లాడుతు ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితంతో సిద్దించిన స్వాతంత్ర అనంతరం సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం భారత దేశం అవతరించిన రోజు, యావత్ భారతా వని పండువగా జరుపుకునే రోజు రిపబ్లిక్ డే అని అన్నారు. అనంతరం జామియ గుల్షనే ఫాతిమా మదరస అధ్యక్షులు హాజీ మీర్ అబ్బాస్ హుస్సేన్, చీఫ్ అడ్మినిస్టర్ రెహమతుల్లా బేగ్ ముఖ్య అతిధిగ విచ్చేసిన విశ్రాంత డిప్యూటీ కలక్టర్ హసీం షరీఫ్ ను శాలువా తో (గుల్ ఫోషి) సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుల్షనే ఫాతిమా మదర్శ సెక్రటరీ ఎస్ కె హరున్, షేక్ షజదాని, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version