Home Politics Andhra Pradesh కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు – జనసేన ఎమ్మెల్యే ‘కీచక పర్వమే’ ప్రత్యక్ష సాక్ష్యం

కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు – జనసేన ఎమ్మెల్యే ‘కీచక పర్వమే’ ప్రత్యక్ష సాక్ష్యం

0

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనడానికి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారమే ప్రత్యక్ష నిదర్శనమని మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్‌పర్సన్, మాజీ రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులే మహిళలపై వేధింపులకు పాల్పడితే రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలని ఆమె ప్రశ్నించారు. ఏడాదిన్నరగా మహిళా ఉద్యోగినిని వేధించడం మానవత్వానికి మచ్చ అని, భర్తకు విడాకులు ఇవ్వాలంటూ బెదిరించడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు. మూడేళ్ల చిన్నారి ప్రాణాన్ని బెదిరింపుగా ఉపయోగించడం అత్యంత దారుణమైన చర్యగా అభివర్ణించారు.
వాట్సాప్ చాట్లు, వీడియో కాల్స్ వంటి ఆధారాలు ఉన్నా ప్రభుత్వం మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే చట్టం పనిచేయదా? అని ప్రశ్నిస్తూ, ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version