Sunday, April 26, 2026
HomePoliticsAndhra Pradeshపరిశ్రమల్లో పాడైనా మెషినరీ తీసేయండి...!

పరిశ్రమల్లో పాడైనా మెషినరీ తీసేయండి…!

వాటి వల్ల ప్రమాదాలు రాకూడదు  ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో మరింత అప్రమత్తం ,ఆఫ్-సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ త్వరితగతిన పూర్తి, క్రైసిస్ గ్రూప్ మేనేజ్మంట్ స‌మావేశంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్  జిల్లా ఆఫ్-సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా సంబంధిత శాఖలు, పరిశ్రమల యాజమాన్యాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పాతబడిన, పనికిరాని యంత్రాలు, స్క్రాప్, నిరుపయోగ సామగ్రిని తొలగించి, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు. గురువారం ఉదయం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో జ‌రిగిన‌ క్రైసిస్ గ్రూప్ జిల్లా స్థాయి సమావేశంలో వివిధ అంశాల‌పై ఆయ‌న మాట్లాడారు. ఈ నెల 17 నుంచి విశాఖపట్నంలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో అన్ని పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని, ఉద్గారాలు.. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు అనుగుణంగా అనుమతించిన స్థాయిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత స‌మావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమల‌కు సంబంధించిన వివరాలను క్రైసిస్ గ్రూప్ మెంబర్ సెక్రటరీ, జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సురేశ్ వివరించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ భద్రతా విభాగ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్ డిప్యూటీ కమాండెంట్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments