Thursday, May 7, 2026
HomePoliticsAndhra Pradeshఅభివృద్ధికి చిహ్నాలు మారుమూల గ్రామాలు

అభివృద్ధికి చిహ్నాలు మారుమూల గ్రామాలు

ప్రతి పల్లే కు రహదార్లు మంచినీళ్లు కల్పిస్తున్నాం ప్రజా సంక్షేమమే మా లక్ష్యం
మంత్రి కింజరాపు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమే పరమావధిక మౌలిక సదుపాయాల కల్పనకు పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు. గ్రామాల ల్లో వృద్ధులు,వికలాంగులు తో సహా కొత్తగా మంజూరైన పింఛనులను పంపిణీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు, పలు అభివృద్ధికి పనులకు 700 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయనీ ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పాలనలో ప్రజా శ్రేయస్సు కొరకు చేసింది ఏమీ లేదని విమర్శించారు, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలు సేకరించి అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు, కోటబొమ్మాలి లో అన్నా క్యాంటీన్ పరిశీలించి నాణ్యమైన భోజనం వివరాలను తెలుసుకున్నారు, పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ అమ్మ వంటిదని మంత్రి కింజరాపు అన్నారు. రైతుల అభివృద్ధి దేశ అభివృద్ధిని వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు వ్యవసాయ పరికరాలు ప్రోత్సాహం కూటమి ప్రభుత్వం ఇస్తుందని మంత్రి కింజరాపు అచ్చం నాయుడు స్పష్టం చేశారు. ఈ పర్యటన కార్యక్రమంలో తెదేపా ప్రతినిధులు బగాధి శేషగిరిరావు, పినకాన అజయ్ కుమార్, మాజీ ఎంపీపీ మట్ట సుందరమ్మ, మట్ట పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments