Sunday, April 26, 2026
HomePoliticsAndhra Pradeshజూలేపల్లిలో తితిదే ధార్మిక కార్యక్రమాలు

జూలేపల్లిలో తితిదే ధార్మిక కార్యక్రమాలు

గోస్పాడు మండలం జూలేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సాయి బాబా మందిరం నందు ఈనెల 17వ తేదీ మంగళవారం నుండి 21వ తేదీ శనివారం వరకు తెలుగు పండితులు డాక్టర్ దోనెపూడి నరేశ్ బాబుచే ధార్మిక ప్రవచనాలు, బాలకృష్ణ, రామకృష్ణ భజన మండలులచే భజన కార్యక్రమాలు శుక్రవారం ముక్కోటి దేవతా స్వరూపమైన గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను స్థానిక భక్త మండలిచే ఆవిష్కరింప చేశారు. ఈ కార్యక్రమంలో నున్న సుబ్బరాయుడు, కత్తెరగండ్ల శివ, మంజుల రాముడు, మంజుల కుమార్, కేతేపల్లి వాణి, కుమ్మరి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments