శ్రీ అప్పలమ్మ 60వ పరస మహోత్సవములు బెస్ట్ ఫ్రెండ్స్ కల్చర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.చిన్న వాల్తేరు గ్రామంలో సుమారు 60 గడపలు ఉన్న రజక వీధి.సంక్రాంతి తర్వాత వచ్చేతీర్థం లేదాపరస అంటారు శ్రీకనకమహాలక్ష్మి(దుర్గ)అమ్మవారి భక్తురాలు అయిన శ్రీ అప్పలమ్మ అమ్మవారు కేల వారి ఆడపడుచు, ఇంటి పేరంటాలు భీముడి పట్నం కెటిన్ గార్డెన్స్ ప్రాంతం నుండి శ్రీ కనకమహాలక్ష్మి దుర్గ అమ్మవారి భక్తురాలుగా చిన్న వాల్తేర్ గ్రామంలో రజక వీధిలో చిన్న పాకలో స్థిర నివాసం ఏర్పరచుకొన్ని, కొంతకాలం తర్వాత భీమునిపట్నం వెళ్లిపోవుట జరిగిందని, మరలా భీముడి పట్నం నుండి ఒంటికాలతో కనకమహాలక్ష్మి దుర్గ అమ్మవారి గుడికి చేరుకున్నదని, ఒకనాడు చిన్న వాల్తేరు గ్రామము నాటి మునసబుకు తన అరచేతిలో కన్ను నేత్రాన్ని చూపెట్టిందని,తరవాత రోజులు తరవాత ఆవిడా జాడ కనబడలేదని , ఒకనాడు గ్రామమంతా మసూచిక వ్యాధి వ్యాపించి ఉన్నప్పుడు , రజక గ్రామస్తులందరూ ఏర్పరచుకున్న స్థలంలో పీను కట్టి మసూచిక వ్యాధి నుండి మమ్మల్ని కాపాడాలని అవన్నీ కోరుకోవడం , ఆవిడి చలవతో రజక గ్రాములో ఎవరికి మసూచిక వ్యాధి సోకలేదని నాటి నుండి రజకలకు ఇష్ట దైవం శ్రీ అప్పలమ్మగా పూజించుట జరిగిందని రజక స్థానిక పెద్దలు తెలియజేశారు . ఆనాటి పూర్వికులు చేత చిన్న కమల పాకలో శ్రీఅప్పలమ్మకు సన్నిధిని ఏర్పాటు చేసుకొని , ప్రతినిత్యం దీపారాధన ,పూజలు, ప్రతీశనివారం భజనలుచేస్తు, ప్రతి సంవత్సరము శ్రీఅప్పలమ్మ పరసను ఘనంగా నిర్వహించకుంటూ వస్తున్నారు.గత ముప్పైయ్ సంవత్సరాల తరువాత రజక యువత గడిచిన పది సంవత్సర లుగా అంచల అంచలుగా శ్రీ అప్పలమ్మ పరస ను రజక యువత ప్రతిష్టాత్మంగా తీసుకొని అన్ని గ్రామ పండగలతో సరి సమానంగా చేయటంలో సఫలీకృతం అయ్యారు నేడు బెస్ట్ ఫ్రెండ్స్ కల్చర్ క్లబ్ అధ్యక్షులు గుర్రాల శ్రీను,యువకులు వినాయక చవితి గణపతి విగ్రహం కళ్ళు తెరిచి చూసే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి చవితి మహోత్సవంలో నిర్వహించడంలో విశాఖ భక్తజనులందరినీ ఆకర్షించ గలిగారు , నేడు చిన్న వీధి పండగను నేడు గ్రామస్థాయిలో శ్రీకనకమహాలక్ష్మి , శ్రీపోలమాంబ పండగలకు దిట్టుగా విద్యుత్ కాంతులు అంబరాన్ని మింటాయి . చిన్నవాల్తేరు గ్రామమంతా విద్యుత్ అలంకరణలతో బహు సుందరంగా అలంకరించి, శ్రీ అప్పలమ్మ వారికి బోనాలు , పట్టు వస్త్రాలు, సారీ సమర్పించడం అనాదిగా వస్తున్నా సంప్రదాయంతో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు శ్రీ అప్పలమ్మ అనుపు మహోత్సవంకు కోల్కత్త ,ఒడిస్సా ,ఖమ్మం, తిరుపతి, తెలంగాణ, రాజమండ్రి తదితర రాష్ట్రాల నుండి నృత్య కళాకారులతో నృత్య ప్రదర్శనలు , స్టేజ్సెట్టింగ్స్ , ఆర్కెస్ట్రా లతో , పెద్ద ఎత్తున బాణసంచ వెలుగులతో మహోత్సవం జరుగుతుందని , రజక సంఘ పెద్దలు, గ్రామ అధ్యక్షులు పాలకొల్లు రాంబాబు ఉత్సాహానికి సపోర్ట్ చేశారని బెస్ట్ ఫ్రెండ్స్ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడు గుర్రాల శ్రీను తెలియజేశారు, ఈ యొక్క పండగకి విశేషం ఏమిటి అంటే రజక కుటుంబకులు శ్రీఅప్పలమ్మ పరసయే సంక్రాంతి పండగ అల్లుడులను , కూతుర్లని , బంధువుల్ని పీల్చుకోవడం సాంప్రదాయం. చుట్టూ ఉన్న గ్రామాల భక్తజనులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొనుటకు. రావడం విశేషం .రజక సోదరులు ఈ విధంగా పండగను చేయడం సాహసోపేతమైనదిని చిన్న వాల్తేరు గ్రామ ప్రజలు అభిప్రాయపడుతు రజక గ్రామ పెద్దలకు , ముఖ్యంగా యువతకు అభినందనలు తెలియజేసారు.
