Home Politics Andhra Pradesh ప్రతిపక్షంలో ఉన్న విజన్ – అధికార పక్షంలో విజన్ మందగించిందా సీఎం కు సూటి ప్రశ్న...

ప్రతిపక్షంలో ఉన్న విజన్ – అధికార పక్షంలో విజన్ మందగించిందా సీఎం కు సూటి ప్రశ్న ఎ ఐ టి యు సి..

0

విశాఖ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ కార్మికుల సామూహిక ధర్నా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ కార్మికుల ఉపాధి హక్కుల కోసం నిర్వహించడం జరిగింది. స్మార్ట్ విద్యుత్ మీటర్ల వలన మూడు వేల ఎనిమిది వందల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారని , స్మార్ట్ విద్యుత్ మీటర్లు విరమించుకోవాలని ప్రభుత్వానికి విన్నత పత్రాలతో విన్నయించడం జరిగింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు , లోకేష్ బాబు పాదయాత్రలో మీటర్ రీడర్స్ కు విద్యుత్ సంస్థలో శాశ్వత ఉద్యోగాలు భద్రత కల్పిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు , లోకేష్ బాబు గత ప్రభుత్వం ఏర్పర్చిన స్మార్ట్ మీటర్స్ ను మేము అధికారంలోకొస్తే ధ్వంసం చేస్తానని పాదయాత్రలో బహిరంగ వేదికల్లో వ్యక్తం చేశారు నేడు అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకో పోగా స్మార్ట్ మీటర్లు పెట్టి విద్యుత్ మీటర్ రీడర్స్ ను అన్యాయం చేయడం ఏమిటని కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.విద్యుత్ సంస్థలో మీటర్ రీడర్స్ గా 3800 మంది కార్మికులు కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నారు, ఒక్కొక్కరికి పీస్ రేట్ పద్ధతిలో మూడు రూ. నుండి 3.62 పైసలు వేతనాలు చెల్లిస్తున్నారు . గతం నెల కు 20 రోజులు రీడింగులు తీసేవాళ్లం , దీనిని నేడు 11 రోజులకు కుదించి, అన్యాయంగా కార్మికులపై అధిక శ్రమను పెట్టి ప్రభుత్వం రెవెన్యూ సంపాదించుకుంటుంది . పని దినములు కుదించుటవలన నెలసరి జీతం ఆదాయం తగ్గి మరోపక్క నిత్యవసర వస్తువులు ధరలు పెరిగి ,నెల వచ్చేసరికి కాంట్రాక్టర్లు జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో మీటర్ రీడర్ కార్మికుల కుటుంబాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు , ఈ విషయాల్ని విద్యుత్ శాఖ ఉన్నత అధికారుల నుండి ప్రభుత్వ పాలకులకు, మంత్రులకు ఎన్నోసార్లు అభ్యర్థించిన్న ఫలితం లేకపోయిందని విద్యుత్ మీటర్ల రీడర్స్ ఆవేదనను వ్యక్తిపరిచారు. ఈ మూడు రోజులు రిలే నిరాహార దీక్షలకు ప్రభుత్వం స్పందించకపోతే 22 తేదిన విద్యుత్ సీఎండీ సామూహిక విన్నత అందజేసి , రాష్ట్ర నడిబొడ్డున అమరావతిలో పెద్ద బహిరంగ సభ మరియు నిరసన ర్యాలీ ప్రదర్శన చేపడతామని ,ఏటీసీ నాయకులు గంటపదంగా అభిప్రాయాన్ని జి ఎస్ జే అచ్యుత్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి తెలియజేశారు. మరియు వివిధ కార్మిక సంఘాల నాయకులు , కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version