Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshమెయిన్ రోడ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

మెయిన్ రోడ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

మెయిన్ రోడ్డు నిర్మాణానికి మంత్రి దిశా నిర్దేశం..రెండు కోట్ల 60 లక్షల రూపాయలతో మెయిన్ రోడ్డు నిర్మాణ పనులు భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోకుండా రోడ్డు వెడల్పు చేపట్టాలి ,దీర్ఘకాలికంగా అపస్కృతంగా ఉన్న సాలూరు నియోజకవర్గంలో పరిధిలో గల మక్కువ మెయిన్ రోడ్ నిర్మాణానికి రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం నాడు మంత్రి గుమ్మడి సంధ్యారాణి క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, రోడ్డు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పాటు మక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు కోట్ల 65 లక్ష రూపాయలు చేపట్టనున్న మక్కువ మెయిన్ రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. మంజూరైన నిధులతో మజ్జి గౌరమ్మ గుడి నుండి సువర్ణముఖి నది వంతెన వరకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని ఆమె ఆదేశించారు. రోడ్డు నిర్మాణం లో భాగంగా ఫటిష్టమైన నాణ్యత ప్రమాణాలు పాటించడమే కాకుండా , భావితరాలకు ఉపయోగపడే విధంగా సరైన వెడల్పు తో రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు.మురుగునీరు వెళ్లేందుకు కాల్వ నిర్మాణ కల్పించాలని మక్కువ తాహాసిల్దార్ కె భరత్ కుమార్ తో పాటు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలతో దిశా నిర్దేశం చేశారు. సూచించిన మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సరైన డిజైన్ తయారు చేయాలని, పారదర్శకంగా నిర్మాణ పనులు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మక్కువ తెలుగుదేశం నాయకులు దాసరి కేశవరావు కూడా ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments