కార్మికులు, కర్షకుల సహకారంతో సుదీర్ఘ చరిత్రను సృష్టించిన గోవాడ సహకార చక్కెర కర్మాగారంలో నేడు కార్మికులు, కర్షకులకు బకాయిలు చెల్లించకుండా, ఫ్యాక్టరీని మూసివేసి లక్షలాది రైతు కుటుంబాలను రోడ్డుపాలు చేసిన ఘనత అధికార కూటమి ప్రభుత్వానిదేనని ఏ.పీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపిస్తున్నారు. బకాయిలు ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి రైతు కార్మిక సంఘాలు అఖిలపక్షాలు ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనలు మంగళవారం నాటికి 19వ రోజుకు చేరుకున్నాయి. ఈ మేరకు రెడ్డిపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం పర్యటనలు చేయడం కాదని, లక్షలాదిమంది ప్రజలకు జీవనోపాధి కల్పించే గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏ.పి. రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు, ఫ్యాక్టరీ కార్మిక సంఘం యూనియన్ నాయకులు శరగడం రామునాయుడు,
సిఐటియు జిల్లా అధ్యక్షుడు వి.వి శ్రీనివాసరావు, ఎన్. వై.ఎస్.యువజన సంఘం నాయకులు నందారపు భాస్కరరావు, రైతు సంఘం నాయకులు ఎస్వీ నాయుడు, నాగిరెడ్డి సత్యనారాయణ, వైసిపి నాయకులు శానాపతి సత్యరావు, తదితరులు పాల్గొని రైతు కార్మిక సమస్యలపై మాట్లాడారు. చోడవరం మాడుగుల నర్సీపట్నం మూడు నియోజకవర్గాల్లో రైతులకు,కార్మికుల కుటుంబాలకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికంగా జీవనోపాధిని పొందే వ్యాపారులకు, వృత్తులు చేసుకునే వారికి లక్షలాదిమందికి ఉపాధిని కల్పించే వ్యవసాయాధారిత పరిశ్రమైన “గోవాడ షుగర్ ఫ్యాక్టరీ” ఏడాది క్రషింగ్ నిలుపుదల చేసి మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, గోవాడ, చుక్కపల్లి, అర్జునగిరి, భోగాపురం,సిరిజాం గ్రామాల నుండి రైతు సభ్యులు గండి దేముడు,బలిరెడ్డి నాగరాజు, ఎం రామారావు, కసిరెడ్డి అచ్చిబాబు, ఫ్యాక్టరీ కార్మిక సంఘం నాయకులు రాయి సూరిబాబు, జి. రవి ప్రసాద్, నాగేశ్వరరావు, శరకాన కోటి, దాడి ఈశ్వరరావు, పీవీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
19 వ రోజు ఫ్యాక్టరీ సమస్యలపై “ప్లకార్డులతో” నిరసనలు
RELATED ARTICLES
