Home News స్మశాన వాటిక వద్ద పంచాయితీ భవనం వద్దు అంటూ నిరసన

స్మశాన వాటిక వద్ద పంచాయితీ భవనం వద్దు అంటూ నిరసన

0

బుచ్చయ్య పేట జయ జయహే
బుచ్చియ్య పేట మండలం కరక గ్రామంలో శనివారం నూతన పంచాయతీ భవనం నిర్మించేందుకు స్థల సేకరణకు వచ్చిన రెవెన్యూ సెక్రటరీ రాము విలేజ్ సర్వేయర్ జగన్ లను స్థల బాదితులు,గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. తాత కాలం నుండి మా సాగులో ఉన్న భూమి ఇప్పుడు తీసుకోవాడం సరికాదని భూబాదితులు వాపోతున్నారు.స్మశానం వద్దనే పంచాయతీ బిల్డింగ్ కడితే ప్రజలకు అందుబాటులో ఉండదని స్థానిక నాయకులు యన్నంశెట్టి నాయుడు, బొబ్బది రామకృష్ణ సంయుక్తంగా మాట్లాడుతూ పంచాయతీ భవనం నిర్మించేందుకు స్థల సేకరణ చేసినప్పుడు గ్రామానికి దగ్గరలో ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ స్థలం గ్రామానికి దూరంగా ఉందని తెలిపారు. స్మశాన వాటికి పక్కనే పంచాయతీ భవనం నిర్మిస్తే ప్రజల ఇబ్బందులు పడతారని గ్రహించాలని తెలిపారు. సంబంధిత అధికారులు మేమిచ్చిన వినతి పత్రం పరిశీలించి గ్రామంలోనే చాలా స్థలు ఉన్నాయని.వాటిని పరిశీలించి నూతన పంచాయతీ భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామంలో ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యన్నంశెట్టి రాజు, యన్నంశెట్టి సాయి, య న్నం శెట్టి సంతోషి, దమ్ము కాసు,దమ్ము సత్తిబాబు , వై.రాము, డి.లక్ష్మణ్, వై చంద్రరావు, వై . శ్రీను, వై రామునాయుడు,పలువురు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version