Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshరేపు రాష్ట్రపతి ముర్ము రాక

రేపు రాష్ట్రపతి ముర్ము రాక

స్వాగతం పలకనున్న గవర్నర్, డిప్యూటీ సీఎం
– పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ వెల్లడి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన ఐఎన్ఎస్ డేగాలో నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి ఇంటిలిజెన్స్ డిఐజి అరిఫ్ హఫీజ్ లతో కలసి అధికారులతో అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 17 వ తేదీ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాయు మార్గం ద్వారా ఐ ఎన్ ఎస్ డేగాకు చేరుకుంటారని, రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ చోళా కు చేరుకుంటారని, అనంతరం బ్యాంక్ట్విట్ విందులో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. 18వ తేదీ ఉదయం ఐ ఎఫ్ ఆర్ లో పాల్గొంటారని, అదే రోజు సాయంత్రం వాయు మార్గం ద్వారా ఢిల్లీ వెళతారని కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 18వ తేదీ న ఐ ఎఫ్ ఆర్ కు హాజరవుతారని అన్నారు. అనంతరం ఐఎన్ఎస్ చోళా, జట్టి వద్ద ఏర్పాట్లను పరిశీలించి విధులు కేటాయించిన అధికారులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ కాన్వాయ్ సెక్యూరిటీ ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ,డిసిపి మేరీ ప్రశాంతి, నేవల్ అధికారులు,పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments