విశాఖపట్నం ఐ ఎన్ ఎస్ డేగా వద్ద భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ఘనస్వాగతం లభించింది. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం విచ్చేసిన భారత రాష్ట్రపతి ముర్ముకి పుష్పగుచ్ఛం అందజేసి నగర మేయర్ పీలా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంచార్జి మంత్రి డోలా వీరాంజ నేయ స్వామి, జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, నేవల్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, సీనియర్ ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ అధికారులు పాల్గొన్నారు,
