Sunday, April 19, 2026
HomeNewsప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు అవినీతి రోగం..!

ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు అవినీతి రోగం..!

ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు అవినీతి రోగం..!
— వైద్యం అందించాల్సిన చోట రాజకీయాలు నడుస్తున్న వైనం..
— ఆసుపత్రిలో నిధులు దుర్వినియోగంపై విచారణ చేయనున్నట్లు సమాచారం..
— ఇక్కడ ప్రధాన వైద్యాధికారి అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఆరోపణ

ప్రత్తిపాడు, జయ జయహే

నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు “అవినీతి రోగం” అంటుకుంది. ఈ హెల్త్ సెంటర్లో నిర్వహణ, అభివృద్ధినిధులు దుర్వినియోగం చేస్తున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఈ ఆరోపణలపై డిసిహెచ్ డాక్టర్ స్వప్న పరిశీలనకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడి పనితీరు మెరుగవ్వకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇక్కడి వైద్యులు, సిబ్బందిని హెచ్చరించిన నేపథ్యంలో
డిసిహెచ్ పై పదవికి అర్హురాలు కాదని ఈ హెల్త్ సెంటర్ ప్రధాన వైద్యాధికారి సంబంధిత వైద్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఆసుపత్రిలో అవినీతి జరుగుతున్నట్టు ప్రశ్నించిన వారిపై బెదిరింపు చర్యలకు దిగుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు ఆసుపత్రికి జ్వరాలతో వచ్చే రోగులను డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ఉన్నట్లు చూపించి ఇన్ బెడ్ పేషెంట్ గా చూపించి ఆరోగ్యశ్రీ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. దీంతోపాటు ఈ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది వర్గాలుగా ఉండి ఒకరిపై మరొకరు నిత్యం వైద్య శాఖ అధికారులకు ఫిర్యాదులు చేయడంతోనే మునిగిపోతున్నారని సమాచారం.

— నిధులు దుర్వినియోగం..
ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిధులు దుర్వినియోగంపై సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టనున్నారని తెలిసింది. ఈ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది జరుగుతున్న వ్యవహారం ఎవరికి ఉన్న ఇబ్బందులు వారే వినతిపత్రం రూపంలో విచారణకు వచ్చే అధికారులకు అందించేందుకు సిద్ధపడ్డారని తెలిసింది. ఆసుపత్రి నిర్వహణ పేరుతో పెద్ద ఎత్తున నిధులను పక్కదారి పట్టించారని విశ్వసినీయ వర్గాల సమాచారం అందింది.

— ఇక్కడికి వచ్చే రోగులకు ఇబ్బందులు..
వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట నుండి మందులు కొనుగోలు చేయాలని బలవంతం చేయడం వారు బయట మందులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోగులకు పలు రకాల రక్త పరీక్షలు ప్రైవేటు ల్యాబ్ లో చేయించుకోమని సలహా ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి మంగళవారం గర్భిణీలకు ఈ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం అందిస్తుంటారు. వారిని కూడా ల్యాబ్ టెస్టులు, స్కానింగ్ నిమిత్తం ప్రైవేటు వారిని సంప్రదించాలని చెబుతున్నారని సమాచారం.
ఇక్కడ జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments