మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, లౌకికవాద మంటే దేవుణ్ణి వ్యతిరేకించడం కాదని, మతాల మద్య సామరస్యాన్ని పెంపొందిస్తూ మత రహిత పాలన చేయాలని మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. ఈనెల 30వ తేదీన మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి సందర్భంగా జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గాంధీజీ సందేశం – సమకాలీన భారత్ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టి కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ బుద్ధుడు తర్వాత ప్రపంచాన్ని అంతలా ప్రభావితం చేసిన వ్యక్తి మహాత్మా గాం
ధీ అని, ప్రపంచానికి అహింస ఆయుధాన్ని అందించి మార్గాన్ని చూపిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. నా సనాతనం నిత్య నూతనమైనదని, ఆధునికతను స్వీకరిస్తూ ముందుకెళ్లి కోట్లాది మంది భారతీయులను కదిలించి స్వాతంత్ర్య సముపార్జనకు నేతృత్వం వహించిన ధన్యజీవి గాంధీజీ అని కొనియాడారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ప్రసంగిస్తూ ఉన్నతమైన లక్ష్యాలను సాధించడానికి మహోన్నతమైన మార్గాలను ఎన్నుకోవాలని మహాత్మా గాంధీ జీవితం మనకు గుర్తు చేస్తుందన్నారు. గాంధీజీ కోట్లాది మంది భారతీయులను కదిలించి స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలచినారని వివరించారు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం పాపపు సొమ్ముగా గాంధీజీ భావించారని, మద్యానికి వ్యతిరేకంగా ప్రజలను జాగృతులను చేశారని, అధికార వికేంద్రీకరణను ప్రోత్సహిస్తూ గ్రామ స్వరాజ్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని, సమాజం నుండి సృష్టించిన సంపదను తిరిగి సమాజానికి వినియోగించాలనే భావనతో ట్రస్టీషిప్ ను ప్రోత్సహించిన గాంధీజీ ఆశయాలను నేటి పాలకులు వమ్ము చేస్తున్నారని తెలిపారు.. ప్రముఖ వైద్యులు డా|| ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ వైవిధ్యాన్ని అంగీకరించడమే హిందూ మతమని, భగవద్గీతలో పొందుపరిచిన దైవిక గుణాలన్నీ మహాత్మునిలో మనకు కనిపిస్తాయనిఅన్నారు, ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి, బీసీ జన మహాసభ అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు, విశ్రాంత అడిషనల్ ఎస్పీ కె.వి. చలపతిరావు, విశ్రాంత ఆచార్యులు సూరం నారాయణరెడ్డి, చంద్రా నాయక్, కాపు శ్రీనివాస్, గంగోలు శామ్యూల్, విల్సన్ తదితరులు ప్రసంగించారు. తొలుత మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రముఖ చరిత్రకారులు ప్రభాత్ పట్నాయక్, ఇర్ఫాన్ హబీబ్, బిపిన్ చంద్ర తదితరులు సంయుక్తంగా రచించిన లౌకిక భారతం కోసం గాంధీ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మతసహనాన్ని పాటించడమే మహాత్మునికి అసలైన నివాళి
RELATED ARTICLES
