Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshహాట్ మిక్సింగ్ ప్లాంట్లో కాలుష్యం లేకుండా మెటీరియల్ తయారీ

హాట్ మిక్సింగ్ ప్లాంట్లో కాలుష్యం లేకుండా మెటీరియల్ తయారీ

అంగీకరించిన కాంట్రాక్టర్,చోడవరం నియోజవర్గ పరిధిలో గల కొత్తకోట హాట్ మిక్సింగ్ ప్లాంట్ లో కాలుష్యం లేకుండా మెటీరియల్ తయారు చేసేందుకు కాంట్రాక్టర్ అంగీకరించినట్టు జనసేన పార్టీ చోడవరం నియోజవర్గం ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు తెలిపారు. రహదారుల నిర్మాణానికి అవసరమయిన హాట్ మిక్స్ తయారీ ప్లాంట్ వలన ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర కాలుష్యం ఇబ్బందులను గ్రామస్తుల అభ్యర్ధనపై జనసేన పార్టీ చోడవరం ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడున్న ఇబ్బందికర పరిస్థితులను సంబంధిత కాంట్రాక్టుకు తెలియజేసి, సదర్ ప్లాంట్ ఆపరేషన్స్ ను తాత్కాలికంగా ఆపివేయమని సూచించడంతో వారు వెంటనే నిలుపు వేసిన విషయo విదితమే.
ఈ పరిస్థితిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు జనసేన ఇన్చార్జ్ రాజు తెలియజేయడం జరిగింది. ఈ పరిస్థితులపై స్పందించిన ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్, స్థానిక అధికారులు నేడు కొత్తకోట గ్రామంలో ఇంచార్జి రాజుతో చర్చించారు. ఈ సమావేశంలో చోడవరం మాడుగులల్లో ఆర్ అండ్ బి రోడ్డు సిద్ధం అయిపోయిన ఆగిపోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని , ఈ ప్లాంట్ ద్వారా వచ్చే కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో తగ్గించడానికి అవసరమైన చర్యలను తీసుకోవడానికి అధికారులు ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.హాట్ మిక్స్ ప్లాంట్లో ఫైర్ చేయడానికి ఉపయోగించే ఆయిల్స్ను అత్యంత నాణ్యమైన వాటిని ఉపయోగించడం, అలాగే మిక్స్ చేసే ముడి పదార్థాలలో డస్ట్ ని పూర్తిగా తొలగించడం చేస్తామని దీనివలన వలన చాలావరకు కాలుష్యాన్ని తగ్గించడం జరుగుతుందని కాంట్రాక్టర్ తెలియజేశారు.అలాగే కొత్తకోట గ్రామంలో తయారవుతున్న ఈ మెటీరియల్ను తొలిత కొత్తకోట గ్రామలో శిదిలం అయిపోయిన రహదారిని పునర్నిర్మాణం చేయడానికి వాడతామని ఈ పనులు ఫిబ్రవరి 2 నుండి ప్రారంభించి 12 లోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.తదుపరి రోలుగుంట నుండి వడ్డాది వరకు శిదిలం అయిన రహదారిని కూడా నిర్మించడానికి పనులు వెంటనే మొదలు పెట్టడానికి మార్చి 31 లోగా పూర్తి చెయ్యడానికి కాంట్రాక్టర్ అంగీకరించడం జరిగిందన్నారం. ఏప్రిల్ 1నుండి ఇక్కడ ప్లాంట్ ని పూర్తిగా ఆపివేస్తామని కాంట్రాక్టర్ అంగీకరించారన్నారు.
ఈ పనులన్నీ పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ లిఖితపూర్వకంగా అంగీకరించారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఇప్పటికైనా కాంట్రాక్టర్ అధికారులు స్పందించడం హర్షనీయం అని , ప్రజల ఆరోగ్యం కన్నా ఏది ఎక్కువ కాదని అలాగే రహదారులు కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అత్యంత నాణ్యత ప్రమాణాలతో ప్లాంట్ ఆపరేషన్స్ కొనసాగించి ఏటువంటి కాలుష్యం లేకుండా చేయడంతో పాటు, ఈ రహదారి నిర్మాణానికి ఈ మెటీరియల్ వాడడానికి కాంట్రాక్టర్ అంగీకారం తెలపడం అభినందనీయమన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments