Home Politics Andhra Pradesh పోలీసులు సేవలు ఆదర్శనీయం

పోలీసులు సేవలు ఆదర్శనీయం

0

పోలీసుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని పీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీఎంపీ అసోసియేషన్) ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు పోతుల సత్యప్రసాద్ అధ్యక్షతన నిడదవోలు సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్‌లో పోలీసుల కోసం ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సీఐ పీవీజీ తిలక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజమండ్రిలోని సత్య కిడ్నీ అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎన్. సత్యప్రసాద్ పోలీసులకు వైద్య సేవలు అందించారు. శిబిరంలో పోలీసులకు స్క్రీనింగ్ రక్తపరీక్షలు, రక్తపోటు పరీక్షలు నిర్వహించి, విధుల్లో ఉండే పని ఒత్తిడి కారణంగా వచ్చే రుగ్మతలు, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బాలాజీ సుందరరావు, జయరాజు, పీఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకరరావు, జిల్లా అధ్యక్షుడు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పీ. దేవానందం, మండల కార్యదర్శి పాండ్రంకి వీవీ వెంకట సత్యనారాయణ, గోవిందరావు, వీరవెంకటరావు, సత్యనారాయణ, సతీష్, తేజ, శివ, పండు, విజయ లేబొరేటరీ సతీష్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version