భారతదేశ బహుజనులంతా ఏకం కావాలి
భారతదేశ బహుజనలంతా ఏకమై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంలో ముందుకు సాగితే మాన్య శ్రీ కాన్సిరాం ఆశయాలు నిజమై బహు జనులంతా రాజ్యాధికారం సాధిస్తారని శ్రీకాకుళం జిల్లా బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సీర రమేష్ బాబు తెలిపారు.
మాన్యశ్రీ కాన్సిరాం 92 జయంతి సందర్భంగా బి టి ఏ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో నివాళులర్పించారు, బహుజనుల రాజ్యాధికారం అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ సారధులు కాన్సిరాం విజయవంతంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సు పరిపాలన అందించిన ఘనత కాన్సీ రాo దని రమేష్ బాబు కొనియాడారు. ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు కాకుండా ఓటు అనే ఆయుధంతోనే రాజ్యాధికారం చేపట్టొచ్చని మాన్యశ్రీ కాన్సిరాం ఈ దేశానికి తెలిపారని బి టి ఏ ప్రధాన కార్యదర్శి పడాల ప్రతాప్ కుమార్ స్పష్టం చేశారు.
బహుజనుల రాజ్యపాలన తో
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నే సమ సమాజం ఏర్పడుతుందని ప్రజాస్వామ్యo ప్రకారం భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేసిన నాడే సుస్థిర అభివృద్ధి జరుగుతుందని పలువురు వక్తలు తెలిపారు,
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు చల్లా రామారావు , విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ లింగాల గరికివాడు, బహుజన నాయకులు బొడ్డేపల్లి కృష్ణారావు, లాస సోమేశ్వరరావు తదితరులు పాల్గొని మాన్యశ్రీ కాన్సిరాంకు నివాళులర్పించారు.
