Home Politics Andhra Pradesh నేటి నుంచి టెన్త్

నేటి నుంచి టెన్త్

0

పరీక్షలు ఏర్పాట్లు పూర్తి

చోడవరం మండలంలో 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు ఎంఈఓ లు నీలకంఠం సింహాచలంలు ఆదివారం తెలిపారు. ఈనెల 16 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. చోడవరం మండలంలో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో గాంధీ గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 220మంది , చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 220మంది, పకీర్ సాహెబ్ పేట ఉన్నత పాఠశాలలో 212మంది, భాష్యం పబ్లిక్ స్కూల్ లో 287మంది,గోవాడ ఉన్నత పాఠశాలలో 180మంది, లక్కవరం ఉన్నత పాఠశాలలో 72మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.ఆరు పరీక్షా కేంద్రాలలో 6 గురు చీఫ్ సూపరింటెండ్స్, 6 గురు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, లక్కవరం కేంద్రం నకు సిట్టింగ్ స్క్వేడ్ నియమించారు. ఈ 6 కేంద్రాలలో మొత్తం విద్యార్థులు 1191 మంది పరీక్షకు హాజరవుతున్నారు. ఇన్విజిలేటర్స్ గా 58 మంది ఉపాధ్యాయులను నియమించారు. పరీక్ష కేంద్రాలలో బల్లలు, టాయిలెట్స్, మంచినీరు, ప్రహరీ గోడ, ఎలక్ట్రికల్, వైద్యం తదితర అన్ని సదుపాయలు అన్నీ కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది.వైద్య సిబ్బంది తో మెడికల్ క్యాంపు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ ఆరు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నది.పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు
ఉదయం 9.00గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్షలు జరిగే రోజులు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఈ సమయంలో పరీక్ష కేంద్రం నుండి 200 మీటర్ల దూరంలో ఎటువంటి జెరాక్స్ సెంటర్లు తెరిచి ఉంచరాదు.పరీక్షలు హాజరుగు విద్యార్థులు అందరు మంచివాతావరం లో రాయుటకు అన్నీ ఏర్పాట్లు చెయ్యడం జరిగింది. విద్యార్దులు గంట ముందు పరీక్షా కేంద్రంనకు చేరుకోవాలన్నారు.దూర ప్రాంత విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసి బస్సులో ఉచితంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version