Home Politics Andhra Pradesh ఆటోలో మర్చిపోయిన బ్యాగును బాధితురాలికి అందజేసిన పోలీసులు

ఆటోలో మర్చిపోయిన బ్యాగును బాధితురాలికి అందజేసిన పోలీసులు

0

ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ ను సామర్లకోట ట్రాపిక్ పోలీసులు నిమిషాల వ్యవధిలోనే బాధితురాలికి అందజేశారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం అంతర్వేది నుండి సామర్లకోట ప్రయాణిస్తున్న కొమ్ముల రమ్య అనే మహిళ కుటుంబ సభ్యులతో అంతర్వేది నుండి కాకినాడ చేరుకుని కాకినాడ లో సామర్లకోట వెళ్లేందుకు కిర్లంపూడి వెళ్ళే ఏపీ 05టీడీ 0508 ఆటోని ఎక్కడంజరిగిందని,సామర్లకోట చేరుకున్న తరువాత ఆటోలో బ్యాగ్ మరచిపోగా,ఆటో డ్రైవర్ శ్రీనివాస్ సైతం బ్యాగ్ ను గమనించకుండా వెళ్ళిపోవడం జరిగిందన్నారు.బ్యాగ్ ఆటోలో మరచిపోవడం గుర్తించిన బాధితురాలు రమ్య వెంటనే సామర్లకోట అవుట్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ట్రాపిక్ ఏస్.ఐ గరగరావు దృష్టికి తీసుకురావడంతో సీసీ కెమెరాల్లో ఆటోను గుర్తించి బ్యాగ్ ను బాధితురాలికి అందజేశారు.బ్యాగ్ ను నిమిషాల వ్యవధిలో గుర్తించి అందజేసిన ఎస్.ఐ గరగరావు, సిబ్బందినీ పలువురు అభినందించారు.*

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version