Home Politics Andhra Pradesh ఘనంగా పోలమాంబ అంపకోత్సవం

ఘనంగా పోలమాంబ అంపకోత్సవం

0

ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని చూసి తరించిన భక్తజనం,కూచిపూడి నృత్యం తో వనం గుడికి తరలివెళ్లిన అమ్మవారు ,వరాలను కురిపించే వరప్రదాయిని…  భక్తకోటి కొంగుబంగారం… గిరిజనుల ఆరాధ్య దైవం శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి సంబరం లో భాగంగా బుధవారం నాడు అంప కోత్సవం శంబర గ్రామంలో భక్త కోటిని పరవశింప చేసింది. శ్రీ పోలమాంబ కోత్సవాన్ని పురస్కరించుకొని వనం గుడికి చేరారు. బుధవారం ఉదయం పది గంటల ప్రాంతంలో అమ్మవారు యాత్రాస్థలం లో గల గద్దె వద్దకు చేరుకున్నారు.  సాంప్రదాయం  ప్రకారం… అమ్మవారి సేవకులు, రివ్వునాయిల్లు, గ్రామ పెద్దలు తోపాటు గ్రామములో చిన్నలు, మహిళలు వేల సంఖ్యలో అమ్మవారి ఉండే గద్దె వద్దకు చేరుకున్నారు. అప్పటికే అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవానికి ఊయలను సిద్ధం చేశారు. గద్దె నుండి అమ్మవారిని వేలాది మంది భక్తజనుల మధ్య ఉయ్యాల కంబాల ఉత్సవానికి తీసుకువెళ్లారు. అక్కడ అమ్మవారు పట్టపు మేక ముందు నడవగా మేళతాళాల, డప్పు వాయిద్యాల దరువు పడుతుండగా… మరోపక్క కూచిపూడి నృత్య భాగవత ప్రదర్శన జరుగుతుండగా శ్రీ పోలమాంబ అమ్మవారు  ఊయల, కంబాల ఊగారు. ఈ ఉత్సవాన్ని తిలకించిన వేలాది  భక్తజనం పరవశించిపోయారు. అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని కనులారా తిలకించిన భక్తజనానికి జన్మ తరించిపోయింది.  అమ్మవారు ఉయ్యాల కంబాల ప్రదేశం నుండి నూతన వస్త్రాలు పై నడుచుకుంటూ  వనం గుడికి అంపకోత్స వానికి బయలుదేరారు. ఈ సమయంలో అమ్మవారి నడిచే దారిలో చిన్నారులను తమ తల్లిదండ్రులు పరుండపెట్టి, అమ్మవారి పాదాలు తాకించారు. చిన్నారులకు ఇలా అమ్మవారి పాదాలు తాగితే వారికి ఆయురా ఆరోగ్యంతో పాటు, సిరి సంపదలు, సుఖసంతోషాలు లభిస్తాయనీ ఈ ప్రాంతీయులు నమ్మకం. అమ్మవారు అంపకానికి  వనం గుడికి అడుగులు వేయగా అమ్మ వెంట వేలాది భక్తజనం అడుగులు వేశారు.

 

 

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version