Home Politics Andhra Pradesh గ్రూప్ టు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు

గ్రూప్ టు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు

0

గ్రూప్ టు లో అర్హత సాధించి , ఉద్యోగాలు పొందిన ఇద్దరు విద్యార్థులను శంబర గ్రామానికి చెందిన ఎంప్లాయిస్ గ్రూపు సభ్యులు అభినందించారు. పార్వతీపురం మన్యం జిల్లా , మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన ఆర్నిపల్లి పోలిరాజు కుమారుడు ఆర్నిపల్లి సంతోష్ కుమార్, ఇదే గ్రామానికి చెందిన గంట బుచ్చియ్య కుమారుడు గంట భాను ప్రసాద్ గ్రూప్ టూ లో అర్హత సాధించిన ఉద్యోగాలు పొందారు. ఆర్నిపల్లి సంతోష్ కుమార్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ , గంట భాను ప్రసాద్ జి ఏ డి అమరావతిలో ఉద్యోగం సాధించారు. వీరిని , వీరి కుటుంబ సభ్యులను శంబర గ్రామానికి చెందిన విశ్రాంతి మండల విద్యాశాఖ అధికారి పెంట సత్యనారాయణ ఆధ్వర్యంలో పూడి లక్ష్మణరావు, తీళ్ల మధుసూధన రావు, తమ్మిరెడ్డి తిరునాధ రావు, పొడిపిపి రెడ్డి సన్యాసినాయుడు, తీళ్ల సతీష్ కుమార్ , అల్లు మన్మధరావు, నైదాన సూర్యనారాయణ, సోమిరెడ్డి వెంకట నాయుడు తదితరులు
ఎంప్లాయిస్ గ్రూప్ సభ్యులు అభినందించారు. గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ఇరువురి విద్యార్థుల తల్లిదండ్రులను దుస్సాలువతో సన్మానించి , మిఠాయిలు తినిపించి అభినందించారు. పూర్వ విద్యార్థులైన ఆర్నిపల్లి సంతోష్ కుమార్, గంట భాను ప్రసాదలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల సాధినకు నిరంతర కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version