- ప్రజా ఉద్యమం” సూపర్ సక్సెస్.
- చంద్రబాబు సర్కార్ పై తిరుగుబాటు మొదలైంది.
- హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు..
- వైఎస్ఆర్సిపి శ్రేణులతో వాసుపల్లి సక్సెస్ మీట్.
విశాఖపట్నం (జయ జయహే ): పేద విద్యార్థులకు వైద్య విద్యకోసం నిర్మితమైన ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కార్ పిపిపి పద్ధతిలో నిర్వీర్యం చేయడం పట్ల జరిగిన ప్రజా ఉద్యమం ర్యాలీ సూపర్ సక్సెస్ అయిందని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆశీలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైయస్సార్సీపీ శ్రేణులతో శుక్రవారం ఉదయం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ హాజరయ్యారు. ముందుగా వాసుపల్లి గణేష్ కుమార్ కు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, సీనియర్ వైఎస్ఆర్సిపి నేతలు సాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ పై తిరుగుబాటు మొదలైందని, ప్రజలు ఇప్పటికే విస్తీపోయి ఉన్నారన్నారు. అమలు కాని హామీలు ఇవ్వడమే కాకుండా, నాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులను కూడా అటకెక్కిస్తున్నారని దుయ్యబట్టారు. నీచమైన రాజకీయాలకు ప్రజలు స్వస్తి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరుతూ రగిలిన ఆగ్రహ జ్వాలలో దక్షిణ నియోజక వర్గం దద్దరిల్లిందన్నారు. భారీగా తరలివచ్చిన దక్షిణ నియోజకవర్గ వైయస్సార్సీపి శ్రేణులతో జరిగిన ప్రజా ఉద్యమం ర్యాలీ విజయవంతం కావడం వార్డు కార్పొరేటర్ నుండి కార్యకర్త వరకు నిబద్ధతతో పాల్గొనడం వలనే అన్నారు. ప్రజల స్వచ్ఛందంగా సంతకాలు చేసి పి పి పి ని వ్యతిరేకించారన్నారు. జగన్మోహన్ రెడ్డి లెజెండ్రీ అని ఆయన నాయకత్వ లక్షణాలు ఆదర్శనీయమన్నారు. సంచలనాత్మకమైన నిర్ణయాలతో నాడు ప్రభుత్వాన్ని అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపారన్నారు. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. ఒర్వలేని చంద్రబాబు.. జగనన్న మార్కు పాలనను తన ఖాతాలో వేసుకుని తన డాబును ప్రదర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, మహిళా నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
