Home News రవీంద్రభారతిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

రవీంద్రభారతిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

0

శ్రీకాకుళం – జయ జయహే
స్థానిక చిన్నమండల వీధిలోగల రవీంద్రభారతి పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ యమ్.తినేష్ మాట్లాడుతూ బాలల దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, సమాజంలో పిల్లల ప్రాముఖ్యతను చెప్పే సందర్భమని , ఈ దేశ భవిష్యత్తు మీ మీదే ఆధారపడివుందన్నారు. రవీంద్రభారతి పాఠశాలల చైర్మన్ యం.యెస్.మణి మాట్లాడుతూ ప్రతి ఏడాది నవంబర్ 14న ఈ దేశానికి పిల్లలే పునాది అని నమ్మిన మన మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూను మనం స్మరించుకుంటామని, అందుకే పిల్లల కోసం ఆయన జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. నార్త్ ఆంధ్రా జోనల్ ఇంచార్జ్ యన్.వెంకటేష్ మాట్లాడుతూ పిల్లలకు ఈ బాలల దినోత్సవం ఎంతో ముఖ్యమైనదని, పిల్లలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎదగడానికి, నేర్చుకునే సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరిస్తారని, నేటి పిల్లలే రేపటి దేశానికి నిజమైన శక్తి రూపాలన్నారు. ఆసక్తిని, ఏకాగ్రతను ఏమాత్రం విడనాడకండని, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చే శక్తి నేటి పిల్లలు రేపటి పౌరులైన మీకే ఉందన్నారు. ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని, అభిమాన, ఆప్యాయతలను, ప్రేమానురాగాలను కలిగి ఉండాలని, పాఠశాల ప్రిన్సిపాల్ యమ్.తినేష్ అన్నారు.
కార్యక్రమములో చిన్నారులు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version