మండల కేంద్రంలోని పెద్దబిడ్డ గ్రామ పంచాయతీలో ఆదివాసి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 9న విజయవంతంగా ముగిసింది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగిన ఈ టోర్నమెంట్‌లో సుమారు 30 జట్లు పాల్గొన్నాయి.
ఫైనల్ మ్యాచ్‌లో పెద్దబిడ్డ, కొండిబా జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితమైన పోటీలో పెద్దబిడ్డ జట్టు విజయం సాధించింది. కొండిబా జట్టు రెండవ స్థానంలో నిలిచింది.విజేత జట్టుకు ప్రథమ బహుమతిగా 20 వేల రూపాయలు, రన్నర్‌అప్ జట్టుకు 10 వేల రూపాయలు, మెమొంటోలు అందజేశారు.కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదివాసి పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చట్టు మోహన్, స్థానిక సర్పంచ్ సాలెపు పెంటమ్మ, గుమ్మ గ్రామ సర్పంచ్ బి. రాములమ్మ, వైసీపీ సూపర్ సర్పంచ్ జె. అప్పారావు, అనంతగిరి మండల టీడీపీ యూత్ అధ్యక్షులు డి. శ్యామ్, జై భారత్ నేషనల్ అరకు పార్లమెంట్ అధ్యక్షులు బి. చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.స్థానిక సర్పంచ్ సాలెపు పెంటమ్మ మాట్లాడుతూ, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపిన ఆదివాసి పరిరక్షణ సమితికి పంచాయతీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. గుమ్మ గ్రామ సర్పంచ్ బి. రాములమ్మ క్రికెట్ నైపుణ్యం ఉన్న గ్రామ యువకులను చట్టు మోహన్ అభినందించారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పలరాజు, ప్రసాద్, నరేష్ గంగులు, కన్నయ్య, వైకుంఠం, అరకులోయ కాంగ్రెస్ అధ్యక్షులు బాబురావు తదితరులతో పాటు గ్రామస్తులు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
