అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలోని
బంగురు రామదాసు
జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ సంయుక్త కార్యదర్శి
మీడియా తో మాట్లాడుతూ.డిప్యూటీ సీఎం మా ఉరికి రోడ్ వేయండి ప్లీజ్ అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో లో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి.
ఈ కార్యక్రమం లో కొన్నెడి లక్ష్మణ్ రావు జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ సంయుక్త కార్యదర్శి . కోరాయి సర్పంచ్ పూజారి కోములు. కొన్నెడి చిన్నారావు మండల కార్యదర్శి. ముత్యం ప్రసాద్ రావు నాయకులు పాల్గొన్నారు.
