వెనుకబడ్డ మాడుగుల నియోజకవర్గాన్ని ఆదుకున్న విధంగా అధిక నిధులు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల మాడుగుల నియోజకవర్గంలో 112 పంచాయతీలు ఉన్నాయని అయితే 12 గ్రామాలకు ప్రస్తుతం రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. తమ నియోజకవర్గంలో మునిసిపాలిటీ లేవని ఇతర ప్రాంతాల కంటే తక్కువ నిధులు కేటాయించారని కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తగు దయ చూపి తమ నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేటాయించాలని ఆయన కోరుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ సభలో ఆనందని పండించిందని ఎమ్మెల్యే తెలిపారు.

