Monday, April 27, 2026
HomePoliticsAndhra Pradeshపుట్టపర్తి లో పట్టా ఫౌండేషన్ సేవ కార్యక్రమాలు

పుట్టపర్తి లో పట్టా ఫౌండేషన్ సేవ కార్యక్రమాలు

మహా శివరాత్రి సందర్బంగా
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రశాంతి నిలయంలో శ్రీ సత్య సాయి ఈశ్వర మహారుద్ర అభిషేకం కార్యాక్రమంలో పట్టా ఫౌండేషన్ సభ్యులు పాల్గొని,స్వామి వారి అభిషేకం వీక్షించి, భగవాన్ శ్రీ సత్య సాయిబాబా పూర్వపు ప్రసంగంలో శివరాత్రి అంటే మహా మంగళకర రాత్రి, నేడు చేసే ఆధ్యాత్మిక సేవలు ఆ పరమశివనికి చేరును. మనలో ఎటువంటి దోషములు ఉండరాదు. సేవ లోనే భగవంతుడుని తరించండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పూర్వపు దివ్య ప్రసంగంలో తెలియజేసినారు . స్వామి దివ్య ప్రసంగాన్ని విని మహారుద్ర గంగ జలాలు, మహా అమృత ప్రసాదం స్వీకరించిన . అనంతరం పుట్టపర్తి లో పుట్టపర్తి లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆశీస్సుల తో మానవ సేవయే మాధవ సేవ లో భాగంగా పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి వృద్ద ఆశ్రమంలో దొడ్డి సూర్యనారాయణ సహకారంతో వృద్దులకు పలురకాల రకాల పండ్లు మరియు మధ్యాహ్నం భోజనం సహాయం చేయడం జరిగింది. ఆశ్రమం ప్రతినిధులు ఫౌండేషన్ సేవలు పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో పట్టా ఫౌండేషన్ ప్రారంభం నుండి ఫౌండేషన్ లోసభ్యులుగా కొనసాగుతున్న పెంట కోట నూకరాజు శ్రీలక్ష్మి పెళ్లి రోజు సందర్బంగా దంపతులు గౌరవ ఆహ్వానితులుగా విచ్చే సిన దొడ్డి సూర్య నారాయణ దంపతులుచే పట్టు వస్త్రాలుతో పెంట కోటనూకరాజు శ్రీలక్ష్మి సత్కరించి పట్టా ఫౌండేషన్ సభ్యులందరు దంపతుల్ని ఆశీర్వ దించడం జరిగింది నేటిసేవ కార్యక్రమాలకు సహాయం అందించిన సోప్ప గంగరాజు కన్వీనర్ సత్య సాయి భజన మండలి వాల్తేర్ అప్ లేండ్స్ విశాఖపట్నం వారికి , స్వామి ప్రశాంతి నిలయంలో నిత్య సేవకులు ఉన్న శివ రెడ్డి, వారికి పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు. పట్టా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments