Home Politics Andhra Pradesh గ్రామీణ ప్రగతికి బాటలు

గ్రామీణ ప్రగతికి బాటలు

0

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన జడ్పీ చైర్‌పర్సన్ సుభద్రకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక వసతుల కల్పనకు జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర నిరంతరం కృషి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నేత జెవివిఎన్ మూర్తి పేర్కొన్నారు. ముంచంగిపుట్టు మండలం సుజనకోట గ్రామం పూజారి వీధి నుంచి గంగమ్మ తల్లి దేవాలయం వరకు రూ. 6.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ సుబ్బలక్ష్మితో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.

*అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రాధాన్యత:*
ఈ సందర్భంగా జెవివిఎన్ మూర్తి మాట్లాడుతూ, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ముంచంగిపుట్టు మండలంలోని ప్రతి గ్రామంలోనూ తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆమె నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు.

*నివేదికల ఆధారంగా నిధుల కేటాయింపు:*
గ్రామాల వారీగా ప్రత్యేక నివేదికలు తెప్పించుకుని, ప్రజల అవసరాల రీత్యా ప్రాధాన్యత క్రమంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, తాగునీటి సరఫరా కోసం నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. దీనితో పాటు కొన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కూడా కల్పించినట్లు గుర్తుచేశారు.

అదే స్ఫూర్తితో నేడు సుజనకోటలోని పూజారి వీధిలో ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషదాయకమని మూర్తి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆకాంక్షతో సుభద్ర పనిచేస్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సన్యాసి, రాజారావు, పాపారావుతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version