జగన్ చేసింది ప్రజా యాత్ర కాదు ప్రతీకార యాత్ర
నెయ్యి కల్తీ వ్యవహారంలో
మాజీ సి ఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం తో కయ్యానికి సిద్ద పడటం మూర్ఖత్వం అని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. శ్యామ్ చంద్ర శేషు విమరించారు.
తన అయిదేళ్ల పాలనలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నింటిలో అవినీతి కి తెర తీసిన అన్నింటిలో అవినీతిచేశారని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజ మెత్తారు.
అది సరిపోలేదని ఆఖరికి కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తితో కొలిచే కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వరస్వామి వారి ప్రసాదంలో కూడా కెమికల్స్ వాడటం క్షమించరాని
అపరాధం అని పేర్కొన్నారు కల్తీ పదార్ధాలతో లడ్డు ప్రశసా దాన్ని తయారుచేయడం అంశమని శేషు అన్నారు.ఢిల్లీలోని ఏపీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఆ వివరాలు స్థానిక మీడియాతోపంచు కున్నారు. ఒక్క పాల చుక్క కూడా లేకుండా కెమికల్స్ తో నెయ్యి సిద్ధం చేసి లడ్డు తయారీలో వాడటం అత్యంత దారుణం
అనిఈ పాపం ఊరికే పోదని పేర్కొన్నారు.దీనిపై దేశ ప్రజలకు,ప్రపంచ స్థాయి లోను వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గతం లో మాదిరిగా వారు గంజాయి బ్యాచ్ కోసం, దొంగలు రౌడీల కోసం, బూతుల మాట్లాడే తమ పార్టీ నేతల కోసం పరామర్శల పేరిట యాత్రల పేరిట ప్రజలపై ప్రతీకార యాత్రలుచేయటం శోచనీయం అన్నారు.
ఈ ప్రయాణంలో అమాయకులను బలి తీసుకుంటున్నారని ఆవేదన చెందారు.
ఈ కార్యక్రమం లో బిసి యూత్ అధ్యక్షుడు పరిస సాయి వినయ్, ఐ టిడిపి కార్యదర్శి తెనాలి చంద్ర శేఖర్, కేసన హేమంత్ కుమార్ తదితరులు ఉన్నారు.
