Sunday, April 26, 2026
HomePoliticsAndhra Pradeshఅంకితభావంతో పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలి

అంకితభావంతో పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలి

జనసేన ఇన్చార్జి పీవిఎస్ఎన్ రాజు

జనసేన పార్టీ అభిమానులు అందరూ సభ్యత్వ నమోదును అంకిత భావంతో నిర్వహించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎస్ఎన్ రాజు పిలుపునిచ్చారు.గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సభ్యత్వ నమోదుపై దిశనిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభమైందన్నారు. అలాగే మన నియోజకవర్గంలో ఈ నెల 26న ప్రారంభం అవుతదని ఇందుకు గాను రావికమతం మండలంలోని తిరుమల ఫంక్షన్ హాల్ లో మన నియోజకవర్గ సన్నాహాక సమావేశం అదేరోజు జరుగుతుందన్నారు.ఈ సమావేశానికి విధిగా క్రియాశీలక వాలంటీర్స్ గ్రామ పార్టీ అధ్యక్షులు మండల నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రోగ్రాం కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు క్లస్టర్ ఇన్చార్జులు యూనిట్ ఇన్చార్జులు నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు వీర మహిళలు ముఖ్య నాయకులు హాజరు కావాలన్నారు. ఈ సమావేశానికి వచ్చే ముందు గ్రామాలలో శుక్ర శనివారాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎన్ని సభ్యత్వాలు లో చేయ గలరో నిర్ణయించుకుని ఖచ్చితమైన సమాచారంతో హాజరు కావలసి ఉంటుందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో సభ్యత్వ నమోదు ఆధారంగానే పోటీ చేసే స్థానాలు అభ్యర్థులు ఎంపిక ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రామ అప్పారావు, చప్పగడ్డి శ్రీను, మోహన్,తెలుగుచర్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments