అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఐటిడిఎ పాడేరు (గిరిజన సంక్షేమ శాఖ) లోని ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ ద్వారా చివరి స్థాయి సేవల అందజేతను బలోపేతం చేసే కార్యక్రమం కింద గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది అయిన డిజిటల్ అసిస్టెంట్లు మరియు వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో సంక్షేమ పథకాల తిరస్కరణలు వాటి పరిష్కార విధానాలు, ఆధార్‌కు సంబంధించిన సమస్యలు మరియు చివరి స్థాయిలో సేవల అందజేతలో ఎదురయ్యే కార్యనిర్వహణ సమస్యలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం అమలు అధికారి ఆర్. రామ గోపాల్, అసిస్టెంట్ ప్రోగ్రాం అమలు అధికారులు రాజేష్ మరియు లోహిత్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తో పాటు కొయ్యూరు మండలం ఎంపిడిఓ కార్యాలయ అధికారులు హాజరయ్యారు.
