ఎన్జీవో ల క్రికెట్ లీగ్ ప్రారంభం
గౌరవ అతిధిగా కె ఎన్ ఆర్
ఉక్కునగరం స్టేడియంలో ఎన్జిఓ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం అయింది. వందేభారత్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ వినోద్ బాలు కెఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ కెఎన్ఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు ముందుగా . క్రీడాకారులను పరిచయం చేసుకొని . అందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా కె ఎన్ ఆర్ మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరగనున్న పోటీల్లో మొత్తం ఇరవై టీంలు పాల్గొంటాయని తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు ట్రోఫీలు అందజేయనున్నట్లు తెలిపారు. సమాజ సేవలో నిత్యం పాల్గొనే ఎన్.జీ.ఓ లు ఆటవిడుపు కోసం నాలుగు రోజుల పాటు క్రికెట్ ఆడుతున్నారని అన్నారు. ఈ మ్యాచ్ ద్వారా యువతకు “ డ్రగ్స్ వద్దు ఆటలే ముద్దు “ అంటూ మంచి సందేశం ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో
నాగేశ్వరరావు , రంజిత్ ,డాక్టర్ స్వరూప్ ,పల్లా త్రినాథ్ ,తదితరులు పాల్గొన్నారు.

