హైవేపై ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమంతో అప్రమత్తం చేస్తున్న పోలీసులు
ప్రజలకు భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా తూర్పు గోదావరి జిల్లా పోలీసులు రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేరాల నియంత్రణపై దృష్టి సారించారు. రాత్రివేళల్లో అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచడంతో పాటు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.
జాతీయ రహదారులపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వినూత్నంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాత్రి పూట దీర్ఘ ప్రయాణం చేస్తున్న వాహనదారులను ఆపి, అలసటతో డ్రైవింగ్ చేయకుండా ముఖం కడుక్కునే సౌకర్యం కల్పించి, కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించేలా సూచనలు ఇస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కూడా కఠినంగా నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనం నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ చర్యలతో నేరాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా పోలీసుల చర్యలకు సహకరించాలని, రాత్రివేళల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.
రాత్రి గస్తీ కట్టుదిట్టం…
RELATED ARTICLES
